‘టాక్సీవాలా’ సెన్సార్ రిపోర్ట్

విజయ దేవరకొండ,ప్రియాంక జవాల్కర్ నటించిన ‘టాక్సీవాలా’ విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ సినిమా సెన్సార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో అభ్యంతరక సన్నివేశాలు ఏమి లేవని సెన్సార్ బోర్డ్ యూఏ సెర్టిఫికేట్ ను ఇచ్చింది.ఎలాంటి రిమార్క్ లేకుండా విజయవంతంగా సెన్సార్ రిపోర్ట్ రావడంపై ఈ చిత్రబృందం సంతోశాన్ని వ్యక్తపరిచారు.

‘టాక్సీవాలా’ ప్రొమోషన్స్ లో విజయ్ కొత్త కోణం

Taxiwala Censor Reportత్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారట.ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ విచ్చేయనున్నారట.పోయిన సారి కూడా ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్ని అతిధిగా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ప్రస్తుతం విజయ్ కున్న క్రేజ్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఈ సినిమా మినీ బాహుబలిలా ఉంటుందని, ఆధ్యంతం సస్పెన్స్ తో ప్రేక్షకులలో ఉత్కంఠను నెలకొల్పుతుందని విజయ్ ప్రమోషన్ లో చెప్తున్నాడు.

ఈ సినిమాలో మరో కథానాయికగా మాళవిక నయ్యర్ కనిపిస్తున్నారు.అలాగే గీతా ఆర్ట్స్ మరియు యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు.మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ ని 100 కోట్ల క్లబ్ లో చేర్చనుందా! వేచి చూడాల్సిందే.

Advertisement