వలసలను ఆపలేమంటున్న టీడీపీ మంత్రులు!

TDP Leader Commentsఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ నుంచి వలసలు ఆ పార్టీకి పెద్ద తల నొప్పులుగా మారాయి.ఇప్పటికే కడప ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి వైస్సార్సీపీ పార్టీ తీర్ధం పుచ్చు కున్నాడు.

వైసీపీలోకి కేఈ కృష్ణమూర్తి?

ఇక ఆమంచి కూడా పార్టీ మారటానికి అన్ని విధాలా సిద్ధం అయ్యాడు.నిజానికి 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే.

‘పరిస్థితులు ఏమీ బాగాలేవు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు. ఆ పార్టీని నమ్ముకుంటే తనకూ రాజకీయ భవిష్యత్తు వుండదు’ అంటూ ఇప్పటికే సన్నిహితుల వద్ద తేల్చేసిన ఆమంచి, అదే అభిప్రాయాన్ని పరోక్షంగా మీడియా ముందు కూడా తాజాగా వెల్లడించడం గమనార్హం.

వైఎస్సార్సీపీలో ఆమంచి చేరుతున్నారనగానే, చంద్రబాబు ఆందోళన చెంది మంత్రుల్ని రంగంలోకి దించారు.ప్రస్తుతం ఆమంచి టీడీపీ మంత్రుల మాట వినే పరిస్థితిలో లేడట.ఇక చేసేదేమీ లేదని ఆమంచితో సంప్రదింపులు జరిపిన ఓ మంత్రిగారు తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని వీడేందుకు చాలామంది టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, అందర్నీ బుజ్జగించడం తమవల్ల కావడం లేదనీ వాపోతున్నాడట.

Advertisement