టీడీపీలో కొత్త ఒరవడి..,బాబుకు మరో దెబ్బ!

TDP Leaders Campaign Detailsఎన్నికల నామినేషన్ మొదలైంది.అధికార ప్రతిపక్ష నేతలు అభ్యర్థులను ప్రకటించారు.దీంతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రచారాలలో మునిగిపోయారు.కానీ టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది.

పవన్ కి తెలిసిపోయిందా?

 

టికెట్ ఖరారైన తర్వాత కూడా టీడీపీ నేతలు పోటీనుండి తప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆదాల ప్రభాకర్ రెడ్డి,మాగుంట శ్రీనివాసులరెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుండి తప్పుకోగా, తాజాగా కర్నూలు జిల్లాలోని బనగానపల్లి ఎంఎల్ఏ బిసి జనార్ధన్ రెడ్డి పోటీనుండి తప్పుకుంటున్నట్లు చంద్రబాబుకు చెప్పారు. ఇలా ఒక్కొక్కళ్ళుగా పోటీనుండి తప్పుకుంటుండటంతో బాబులో ఆందోళన పెరిగిపోతోందట.

ఒకవైపు వైసీపీలో టికెట్ల కోసం పోటీ పడుతుంటే ,మరోవైపు టీడీపీలో టికెట్లు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా తప్పుకుంటున్నారు.అసలు విషయం ఏమిటంటే అభ్యర్ధులు కూడా తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు. ఆ సర్వేలో పార్టీపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాల ఆధరణ స్పష్టంగా కళ్ళకు కనబడుతోంది. దాంతో గెలవమని తెలిసీ పోటీచేసి కోట్ల రూపాయలు తగలేసుకోవటం ఎందుకని పోటీనుండి తప్పించుకుంటున్నారు.