చివరికి చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చాడట!

TDP Leadersఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబుకు టెన్షన్ పెరిగిపోతుంది.ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులను పోటీకి పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది.

రాజధాని ప్రాంతంలో జగన్ హవా చూశారా?

శ్రీశైలం స్థానం తీసుకుంటే ఇక్కడ ఓ అభ్యర్థికి టీడీపీ టికెట్ ఇచ్చింది. తీరా టికెట్ ప్రకటించేసిన తర్వాత ఆయన తాను పోటీకి దిగడం లేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వదలారు. దీంతో టీడీపీకి దిక్కుతోచలేదు. మళ్లీ ఆయన్నే బుజ్జగించే పని చేపట్టింది.

ఇంతలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరతానంటూ రాయబారాలు పంపాడు. హమ్మయ్య అభ్యర్థిలేక ఇబ్బందిపడుతున్న చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నాడు.

ఇంతకీ ఈ బైరెడ్డి ఎవరు అనుకుంటున్నారా,ఆరేడేళ్ల కిందట ప్రత్యేక రాయలసీమ అంటూ ఈయన హడావుడి చేశాడు.

నంద్యాల ఉపఎన్నికలో భారీగా ప్రచారం చేసినా ఈయన పార్టీకి వచ్చింది కేవలం 143 ఓట్లు మాత్రమే.చివరికి బాబు ఇలాంటి అభ్యర్ధికి కూడా టికెట్ ఇవ్వాల్సివస్తుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.