ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..

TDP Leaders into YSRCPఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సమయం దగ్గర పడటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయా అంటే అవుననే చెప్పాలి.దీంతో రోజురోజుకి వైసీపీ పార్టీలోకి వలసలు పెరిగి పోతున్నాయి.

నా ప్రెస్ మీట్ కి ఆంధ్రజ్యోతి రావొద్దు:వైయస్ జగన్

ఇప్పటికే టీడీపీ నేతలు మేడా మల్లిఖార్జున రెడ్డి ,ఆమంచి కృష్ణ మోహన్ ,అవంతి శ్రీనివాస్ వైస్సార్సీపీ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇంతటితో ఈ వలసలు ఆగేటట్లు కనిపించట్లేదు.

ఉత్తరాంధ్రకు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు వారితో మాట్లాడించే ఏర్పాటు చేయాలని, ఆ జిల్లాలకు చెందిన మంత్రులకు చెప్పినా, సదరు ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.

నిజానికి చంద్రబాబు సైతం స్వయంగా అవంతి శ్రీనివాస్‌ తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.ఏదిఏమైనా టీడీపీ ఎమ్మెల్యేల వలసలు ఇప్పుడల్లా ఆగేటట్టు కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement