వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు!

TDP Leaders Joins in YCPఎన్నికలు దగ్గర పడుతుండంతో నేతలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు.ఈ క్రమంలో పలువురు నేతల చూపులు ఇప్పుడు వైసీపీ వైపే ఎక్కువగా ఉంటున్నాయి.

వైసీపీలోకి మరో కీలక నేత!

కడప జిల్లా మాజీ ఎమ్మెల్యే ఖలీల్ భాషా కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన కూడా ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ ను కలవనున్నారు.నిజానికి ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

కడపలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అంజాద్ భాషాకు మళ్లీ టికెట్ ఖాయమైంది.మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లా టీడీపీలో చేరడంతో, ఖలీల్ భాషాను పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని అంజాద్ భాషానే ఆయన్ను ప్రతిపాదించారు.దీంతో ఖలీల్ భాషా చేరిక ఖాయమైంది. ఎల్లుండి కడపలో జరిగే సమావేశంలో ఆయన పార్టీలో చేరనున్నారు.

అలాగే ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 13వ తేదీన ఒంగోలులో జరిగే సమర శంఖారావం సభలో ఆమంచి వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

Advertisement