ఒక్కొక్కరుగా కాపు సామాజిక వర్గ నేతలు వైసీపీలోకి..

TDP Leaders Jumps in YCPతెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలబోతోందా? అంటే అవుననే చెప్పాలి.ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు.

త్వరలోనే ఆరేడుగురు సిట్టింగులు టీడీపీ నుంచి బయటి కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ అనే చెప్పొచ్చు.

వైసీపీలోకి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్!

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా టీడీపీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఒకటి రెండ్రోజుల్లో జగన్ ను కలిసి పార్టీలో చేరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. మరికొన్ని రోజుల్లో ఇంకొంత మంది కాపు సామాజిక వర్గ నేతలు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రానున్న ఎన్నికలలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీలోకి వస్తే,కాపుల ఓట్లు వైసీపీకి ప్లస్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.