బాబుకు డ‌బుల్ స్ట్రోక్ మరో ఇద్ద‌రు కీల‌క‌ నేత‌లు అవుట్..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు సమీపిస్తున్న త‌రుణంలో ఒక‌వైపు అభ్య‌ర్ధుల ఎంపిక మ‌రోవైపు తెర‌పైకి వ‌స్తున్న జాతీయ స‌ర్వేలు అధికార తెలుగుదేశం పార్టీకి నిద్ర‌లేకుండా చేస్తున్నాయి.

చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్

ఈ నేపధ్యంలో తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళ‌కు వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో మ‌రో షాక్ తగలనున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్ప‌టికే నెల్లూరు జిల్లా అర్బ‌న్ టిక్కెట్ మంత్రి నారాయ‌ణ‌కు ఖారారు అయిన విషయం తెలిసిందే.దీంతో నెల్లూరు రూర‌ల్ పై ఆశావ‌హుల కన్ను పడినట్లు సమాచారం.

అయితే ఇప్పుడు ఆ టిక్కెట్ ని ఆదాల ప్ర‌భాక‌ర్‌కు ఖ‌రారు చేయ‌డంతో చంద్ర‌బాబు పై తీవ్రంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు ఇద్ద‌రు టీడీపీ నేత‌లు.

ఒక‌రు అబ్దుల్ అజీజ్ కాగా, మ‌రొక‌రు ఆనం జ‌య‌కుమార్ రెడ్డి.ఈ నేప‌ధ్యంలో అబ్దుల్ అజీజ్ ఏకంగా బాబు పై బ‌హిరంగ విమ‌ర్శ‌ల‌కు దిగారు.

టీడీపీలో మైనారిటీల‌కు స్థానం లేద‌ని, త‌మ‌కు చంద్ర‌బాబు అన్యాయం చేస్తున్నార‌ని క‌ల‌క్ట‌రేట్ ముందు ఆందోళ‌న చేప‌ట్టారు.

ఈ నేప‌ధ్యంలో అబ్దుల్ అజీజ్ టీడీపీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని స‌మాచారం.ఇక ఆనం జ‌య‌కుమార్ రెడ్డిది కూడా టీడీపీని న‌మ్ముకుందుకు త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని బాబు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబుకు డ‌బుల్ స్ట్రోక్ త‌ప్పేలా లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement