గెలిస్తే వైసీపీ నేతలను నరుక్కుంటూ పోదాం:టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో,అధికార ప్రతిపక్ష నేతలు అనేక హామీలు ఇవ్వడం సహజం.గెలిచిన తరువాత అవి ఎంతవరకు అమలు చేస్తారో అన్నది పక్కన పెడితే,టీడీపీ నేతలు మరీ ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది.

వైసీపీలో భారీగా చేరిన టీడీపీ నేతలు!

అసలు కథ ఏంటంటే ,టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలను అంతమొందించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.అందుకు సాక్ష్యమే ఈ వీడియో.

ఎన్నికల కౌంటింగ్ పూర్తవగానే ప్రత్యర్థులను నరుక్కుంటూ పోదామంటూ, ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి చెప్పిన మాటల వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.అయితే ఇక్కడ విశేషమేమిటంటే వరదాపురం సూరిపై అసమ్మతితో ఉన్న టీడీపీ నేతలే ఈ ఆడియో టేపులను బయటపెట్టడం.