వోట్ వెయ్యండహో – మీడియా ప్రకటనలు కొత్త పంథాలో!

ఒక్కో కులం,ఒక్కో మీడియా ఛానల్ ,ఒక్కో న్యూస్ పేపర్ తమకు నచ్చిన పార్టీ ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాయనేది నిన్న -మొన్నటి మాట గా అయిపోతుందా?! అలానే అనిపిస్తుంది ఎన్నికల నేపథ్యం లో గత వారం నుంచి తెలుగు మీడియా వరస చూస్తుంటే.

లోపల ఎన్ని అవసరాలున్నా ., ప్రజలకు బాధ్యత గుర్తు చేస్తూ తమ వంతు కర్తవ్యాన్ని మీడియా సంస్థలు నిర్వర్తిస్తున్నాయి. వోట్ వేయడం యొక్క వశ్యకత ను తెలియచేస్తూ ., దానికి సంబందించిన విశ్లేషణలు చేస్తూ ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఈ చానెల్స్ సృష్టించాయి.

రేపు పోలింగ్.,11న లెక్కింపు!

మధ్య లో పలు సంస్థలు “వోట్ వేయండి ., మా సంస్థలో ఉచిత సేవలు పొందండి ” అంటూ చేస్తున్న ప్రకటనలు కూడా ఆసక్తి గా ఉన్నాయి . ఇక మేరు అనే విద్య సంస్థ పిల్లలతో “మాకు వోట్ వేసే అవకాశం లేదు . కానీ మీ వోట్ మా భవిష్యత్తు ని నిర్ణయిస్తుంది ” అంటూ చెప్పించడం మనసుని తాకేలా ఉంది.

Telangana Elections 2018 Adsఅలాగే కొన్ని వైద్య సంస్థలు , ఆభరణాలు దుకాణాలు , ఎరువుల మందుల సంస్థలు ఇంతకు ముందు పండగలకు మాత్రమే శుభాకాంక్షలు తెలిపేవి .ఇప్పుడు వోట్ వేయండి అంటూ సామాజిక స్పృహ ని కూడా కలిగిస్తూ ఆకట్టుకుంటున్నాయి. చూస్తుంటే మార్పు మెల్లగా వస్తున్నట్లే ఉంది. మంచిని స్వాగతిద్దాం.

Advertisement