ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం ….సోమవారం లోపు జీతాలు చెల్లించండి

telangana rtc employees strike
telangana rtc employees strike

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణం గా కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు అందకపోవటంపై హైకోర్టు లో విచారణ కొనసాగింది .సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వలేదు అని జాతీయ టీఎంయు హైకోర్టు లో పిటషన్ వేసింది.ఆర్టీసీ లో ని కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు.

ఆర్టీసీ యాజమాన్యం సమ్మె కారణం గా జీతాలు చెలింపులలో ఆలస్యం జరిగినట్లు వివరణ ఇచ్చింది .ఇరువురి వాదనలు విన్న కోర్ట్ సోమవారం లోపు జీతాలు చెల్లించవలసింది గా ఆదేశించింది.తదుపరి విచారణ ని సోమవారం కి వాయిదా వేసింది.