తెలంగాణ రాష్ట్ర బంద్-స్తంభించిన జన జీవనం

తెలంగాణ రాష్ట్ర బంద్

telangana-bandh-today

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మె మద్దతు గా ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు చేస్తున్న “తెలంగాణ రాష్ట్ర బంద్ ” వలన తెలంగాణ రాష్ట్ర జన జీవనం స్తంభించింది .బంద్ ను జయప్రదం చేసేందుకు కార్మిక సంఘాలు అలుపెరగని ఏర్పాట్లు చేస్తుంది .తెలంగాణ రాష్ట్ర టాక్సీ ,డ్రైవర్స్ జేఏసీ కూడా “తెలంగాణ బంద్” కు పూర్తి మద్దతు ను ప్రకటించింది .ఇప్పటివరకు తిరుగుతున్న కొన్ని వాహనాల కు కూడా బ్రేక్ పడినట్లు అయ్యింది .

ఆటో డ్రైవర్స్ కూడా తెలంగాణ బంద్ లో పాల్గొనాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు ,అదేవిదం గా ఉబర్,ఓలా క్యాబులు బంద్ లో పాల్గోవటం తో అత్యవసర పరిస్థితుల్లో బయటకి వెళ్లవలసిన వారికి కూడా అసౌకర్యం కలగనుంది .క్యాబులు బంద్ కారణం గా విమాన ప్రయాణికులు కూడా అసౌకర్యం కలగనుంది .బంద్ దృష్ట్యా ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మెట్రో రైళ్లను నడుపుతుంది.