కళ కళ లాడుతున్న బిగ్ బాస్ హౌస్ …..

telugu bigg boss3
telugu bigg boss3 finale

ఏమిటి ఐదుగురు కాంటెస్ట్స్ తో కళ కళ లాడటం అనుకుంటున్నారా ? ఎవరైనా కొత్త గెస్ట్ వచ్చారు అనుకుంటున్నారా ? ఒకరు ఇద్దరు కాదండి ఏకంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్‌ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకోని వచ్చారు .వీరు చేసే అల్లరి ,ఆట పాటలతో ఈ రోజు ఎపిసోడ్ అదరహో అనబోతుంది .తాజా ప్రోమో ప్రకారం హేమ, జాఫర్‌,తమన్నా, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్‌, శివజ్యోతి, హిమజ, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.ఇక వీళ్ళ రాక తో బోసిపోయిన హౌస్ మరల కళ కళ లాడుతుంది .బిగ్‌బాస్‌ యాజమాన్యం తన
విషయం లో అన్యాయం చేసారని బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. శ్రీముఖి , హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ ‘వద్దమ్మా’ అంటూ ఆమెకో నమస్కారం పెట్టింది.మా అక్క తోపు అని రీసౌండ్ …..ఇక చూడాలి ఏ రోజు ఎపిసోడ్ వింతలు విచిత్రాలు .