బిగ్ బాస్ ఇంట్లో దీపావళి సందడి చేస్తున్న “విజయ్ దేవరకొండ”

బిగ్ బాస్ హౌస్ లో చివరి నామినేషన్ ఈ రోజు జరగనున్నది, ఇప్పటికే రాహుల్ సిప్లిగంజు, బాబా భాస్కర్, శ్రీముఖి ఫైనల్ లో కి వెళ్లగా, అలీ రెజా, వరుణ్ సందేశ్, శివజ్యోతి నామినేషన్ లో వున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు, ఈ రోజు బిగ్ బాస్ హౌస్ ని వదలనున్నారు. దీపావళి పండగ సందర్భం గా హౌస్ లోని కి విజయ్ గెస్ట్ గా వచ్చినట్లు ప్రోమో ని రిలీజ్ చేశారు.

ఈ ప్రోమో లో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్‌ హౌస్‌లోని కన్ఫెషన్‌ రూమ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్‌ రూంలోకి పిలవ గా విజయ్ ని చూసి అందరు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఇక మన జ్యోతక్క ఓ అడుగు ముందుకేసి లడ్డుగైనవ్‌. అంటూ విజయ్ ని అడిగింది.

వైఫ్‌ లేకుండా ఎలా ఉంటున్నావ్‌ అని విజయ్‌. వరుణ్‌ను అడిగాడు. అంతేకాకుండా అతడి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. నాగార్జున విజయ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘నీ పెళ్లి గురించి 6 నెలల కి ఒక రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడిగాడు. దీనికి విజయ్ ‘ఇంకా తన అమల దొరకలేదు’ అని నాగ్‌కు ఫన్నీ కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి నాగ్‌ బదులిస్తూ ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’నని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్‌ దీపావళి సరద తో సాగుతున్నట్టు కనిపిస్తోంది. విజయ్ దీపావళి సందడిని చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే!