మరో సారి జమ్మూకాశ్మీర్ లో తెగబడ్డ ఉగ్రవాదులు ……

terrarist attack in anantnag dist, Jammu&kashmir
terrarist attack in anantnag dist, Jammu&kashmir

జమ్మూ కశ్మీర్‌లో మరల భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం రావటం తో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడగా… దానిని చుట్టిముట్టిన సైన్యం ముగ్గురు ముష్కరుల్ని హతమార్చింది ఎదురు కాల్పుల లో ఇద్దరు CRPF జవానులు మరణించారు ఒకరు గాయపడ్డారు.