పవన్ కళ్యాణ్ పై తమ్మారెడ్డి కామెంట్స్

ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టడానికి ఎంత వరకూ ఛాన్స్ ఉంది..అందుకోసం అనుసరించాల్సిన విధానాలపై అభిప్రాయాలను పంచుకున్నారు టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత, సినీ, రాజకీయ విశ్లేషకులు తమ్మారెడ్డి భరద్వాజ.

అన్నీతానై వ్యవహరించిన ఎన్టీఆర్

ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, జగన్‌లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకం. ఈ ముగ్గురు వ్యక్తుల మీదే రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి,పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ తరువాత నాలుగు సంవత్సరాలు సపోర్ట్ చేశారు.కాగా ఆర్నెళ్ల ముందు సెపరేట్‌గా జనంలోకి వచ్చి ఒంటిరిగా పోరాటం చేస్తామంటున్నారు. పొలిటికల్‌గా యాక్టివ్‌గా అయ్యారు.గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఏవైతే తప్పులు జరిగాయో ఇప్పుడు అవి జరక్కుండా ఉండాలి’ అని అన్నారు .