ఇదీ జగనంటే!

That is YS Jaganఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన 22 మంది ఎంల్ఏలు, ముగ్గురు ఎంపీలు జగన్ ను కాదనుకుని టీడీపీలోకి ఫిరాయించారు. అక్కడున్నంత కాలం అన్నీ అధికారాలను అనుభవించారు.

ఆ మాటలకు చెక్ పెట్టిన జగన్!

ఆనాడు ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుని టిడిపిలోకి ఫిరాయించి, తీరా అక్కడ టికెట్ దక్కకపోయేటప్పటికి మళ్ళీ జగనే గుర్తుకు వస్తున్నాడు.

ఫిరాయింపుల్లో ముందుగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపిలో నుండి మళ్ళీ వైసీపీలో చేరారు. తాజాగా కర్నూలు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి కూడా తిరిగి వైసీపీలో చేర్చుకోమంటూ జగన్ కాళ్ళా వేళ్ళా పడుతున్నారు.

టికెట్లు రాని కొందరు తాము పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నామంటున్నారు. తాము చేసిన తప్పు తెలుసుకున్నామని లెంపలేసుకుంటున్నారు. తమ తప్పు తెలుసుకున్నాం కాబట్టి తమను తిరిగి వైసీపీలో చేర్చుకోవాలంటున్నారు.వీళ్ళందరికీ జగన్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందా?.