23 స్థానాలలో వైసీపీ : టైమ్స్ నౌ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.అయితే తాజాగా టైమ్స్‌ నౌ ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

అమిత్ షా కు షాక్ ఇచ్చిన హైకోర్టు !

మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు,ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 25 స్థానాలకుగాను 23 స్థానాలలో విజయం కాయం అని స్పష్టం చేసింది.అలాగే రెండు సీట్లకు మాత్రమే తెలుగు దేశం పార్టీ పరిమితమవుతుందని సర్వే తేల్చింది.

అటు జాతీయపార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవలేవని తెలిపింది.
టీడీపీ, వైఎస్సార్‌ సీపీ మధ్య ఓట్ల తేడా కూడా భారీగానే ఉంటుందని ,ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్‌సీపీదే పై చేయిగా కనిపించింది సర్వే పేర్కొంది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 8 లోక్‌సభ స్థానాల లో గెలుపొందింది,అలాగే ఒకప్పటి మిత్రులు ఆయన టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా 17 స్థానాలు మట్టుకే వచ్చాయి.