టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే–2019 : ఏపీలో వైసీపీదే గెలుపు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే–2019 వెల్లడించింది.

స్టేట్ యూనిట్ కార్యదర్శిగా పృథ్వీ రాజ్

ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాల్లో విజయదుందుభి మోగించనుందని తేలింది.అధికార టీడీపీ పార్టీ కేవలం 3 స్థానాలకు పరిమితం కానుందని స్పష్టం చేసింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కి 45.5 శాతం ఓట్లు రాగా, ఈసారి ఏకంగా 48.8 శాతం ఓట్లను దక్కించుకోనుందని తెలిపింది.

అదే సమయంలో గత ఎన్నికల్లో 40.5 శాతంగా ఉన్న టీడీపీ ఓటింగ్‌ శాతం ఈసారి 38.4 శాతానికి పడిపోనుందని సర్వే స్పష్టం చేసింది. గతంతో పోల్చుకుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరగనున్నట్లు టైమ్స్‌నౌ– వీఎంఆర్‌ సర్వే 2019 లో వెల్లడయింది.