టొమాటో రైస్

త్వరగా తయారైయ్యే వంటకాలలో ఈ టొమాటో రైస్ కూడా ఒకటి .దీని తయారీ విధానం కూడా చాలా సులువుగా ఉంటుంది.
అమ్మ చేసే వరకు వెయిట్ చేయక్కర్లేదు… ఆకలేస్తే మీరే చేసేసుకోవచ్చు. ఇక రూమ్ లో ఉండి చదువుకునే బ్యాచిలర్స్ కి ఈ రైస్ ఐటెమ్ మరీ సులువుగా ఉంటుంది.
మరి ఈ టొమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

బన్నీ నిర్మాతగా మారబోతున్నాడా ?

Tomato Rice

కావాల్సిన పదార్థాలు:

అన్నం – 2 కప్పులు,
టొమాటో ముక్కలు – 1 కప్పు,
ఉల్లిపాయ – 1 ,
పచ్చిమిర్చి – 2 ,
కరివేపాకు – గుప్పెడు ,
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీ స్పూను,
సాంబార్ పొడి – 1 టీ స్పూను
ఉప్పు – రుచికి సరిపడినంత,
నూనె – సరిపడినంత,
ఆవాలు – 1/2 టీ స్పూను
కొత్తిమీర – 1/2 కప్పు

తయారుచేయు విధానం:

స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని వేడైన తరువాత నూనె వేసుకొని వేడిచెయ్యాలి. అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకొని ,
తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ముక్కలు, వేసి వేయించుకోవాలి.అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించుకోవాలి .
ఇప్పుడు టొమాటో ముక్కలు, చిటికెడు పసుపు, సాంబార్ పొడి , రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి.
బాగా వేగాక అందులో వండిన అన్నాన్ని కలిపి పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.