ఫాదర్ సెంటిమెంట్ తో రానున్న త్రివిక్రమ్ ?

Trivikram Comes With father Sentiment in next movieమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరో, హీరో ఫాదర్ కు మధ్య ఎక్కువగా సెంటిమెంట్ ఉండేలా కథలు రాసుకుంటాడు.

జులాయి చిత్రంలో అల్లు అర్జున్, తనికెళ్ళ భరణి మధ్య చక్కటి సన్నివేశాలు ఉంటాయి.అలాగే ప్రకాష్ రాజ్ తోనే సన్ అఫ్ సత్యమూర్తి కథ అంత సాగుతుంది.

త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న మన్మధుడు 2

ఇలా తన ప్రతి సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉండేలా చూసుకుంటాడు త్రివిక్రమ్.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తాజాగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో కూడా అలాంటి సెంటిమెంటే రాసుకున్నట్లు తెలుస్తుంది.వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే స్టార్ట్ అయ్యేది కాని త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతకు ముందు అనుకున్న రీమేక్ కథ కాకుండా ఫ్రెష్ సబ్జెక్టు ఎంచుకోవడంతో వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుందట.
గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Advertisement