ఏపీలో టీఆర్ఎస్ సర్వే … గెలుపు ఎవరిదంటే ?

ఏపీలో రానున్న ఎన్నికలకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఏపీలో సర్వే నిర్వహిస్తున్నారంట.ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు ఓటమిని చూస్తారో అని ఇప్పటికే తెరాస కి తెలిసిపోయిందని సమాచారం.

ఇప్పటికే తెరాస తమ మద్దతు ఎప్పుడు కూడా వైసీపీ కె ఉంటుందని ప్రకటించగా, అధికార టీడీపీ ని ఓడించడానికి ప్రయత్నిస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించి ఏపీలో తెరాస సర్వేలు కూడా చేపట్టింది.

సర్వేల ఫలితాల ప్రకారం ఏపీలో వైసీపీకి 92 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అధికార టీడీపీకి 70 సీట్లకు మించి రావని తెలిపింది.కాగా కొత్త పార్టీ అయినటువంటి జనసేన కేవలం 13 స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలో తేలినట్లు సమాచారం.

ఈసారి ఏపీలో అధికారంలోకి రాబోయేది వైసీపీ పార్టీ అని తెరాస సర్వే ఈసారి ఏపీలో అధికారంలోకి రాబోయేది వైసీపీ పార్టీ అని తెరాస సర్వే తేల్చి చెప్పింది