ఏపీ సీఎంగా కొనసాగే నైతికత బాబుకి లేదు:కేటీఆర్‌

ఆంధ్రప్రదేశ్ లో సంచలంగా మరీన ఐటీ గ్రిడ్స్‌ స్కాం పై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు.ప్రజలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అన్నారు.
ప్రజల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని ఐటీ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు.

వైసీపీలో చేరిన రవి చంద్రారెడ్డి!

ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీచేసిందన్న ఫిర్యాదు మేరకే తెలంగాణ పోలీసులు స్పందించారని,ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ హస్తంమేమీ లేదని ఆయన వెల్లడించారు.ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారని, తెలంగాణలో ఏపీ పోలీసులుకు ఏం పని అని,ఏం తప్పుచేయని చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగే అర్హత బాబుకు లేదన్న విషయాన్ని ప్రజలు గమనించాలని వ్యాఖ్యానించారు.ఐదు కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఐటీగ్రిడ్స్‌కు ఇవ్వమని ఆయనకు ఎవరు పర్మిషన్‌ ఇచ్చారని,ఐటీ గ్రిడ్స్‌ మీద విచారణ చేపడితే టీడీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్‌ ప్రశ్నించారు.

తప్పు చేసి దొరికిన బుకాయించుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటేనని,తప్పుచేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కొవాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.