తెలంగాణ ఆర్టీసీ కార్మికుల “సకల జనుల సమరభేరి”

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం “సకల జనుల సమరభేరి” పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో విపక్ష పార్టీలన్నీ కలసి రాబోతున్నవి . మొదట ఈ సభను సరూర్‌నగర్‌ మైదా నంలో భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నా పోలీసులు అనుమతి నిరాకరించటం తో జేఏసీ నేతలు హైకోర్టు ని ఆశ్రయించటం తో ,వాదోపవాదనలు విన్న కోర్ట్ , సూచనలతో పరిమితులతో కూడిన సభలాగా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. 7 గంటల లోపు ఖాళీ చేయాలని, శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీసులకు జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి హామీ ఇవ్వాలని ఆదేశించారు. సభలో ప్రసంగించే వారి సంఖ్యను ఐదుగురికి పరిమితం చేయాలన్నారు. మరో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వొచ్చని, ప్రసంగించే వారి పేర్లను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఐదువేల మందికి మించి పాల్గొనవద్దని ఆదేశించారు.