జగన్ కేసీఆర్ దోస్తీపై వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి!

Undavalli Comments on Jagan-KCRఉండవల్లి ,ఆయన నోరు విప్పితే చాలు అందరూ టెన్షన్ పడుతుంటారు.ఎందుకంటే ఆయన తెలివైన రాజకీయ నాయకుడు, పైగా న్యాయ వాది. ఉండవల్లిని ఎదుర్కోవడం అంటే చాలా కష్టం.

రాధ పార్టీని వీడటం.. జగన్ కి ఇంత లాభమా!

ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో,ఆయన జగన్ గురించి ఈ విధంగా స్పందించారు.జగన్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసు అని, వైఎస్సార్ కొడుకుగా జగన్ని తాను ఎపుడు అభిమానిస్తానని.,జగన్ ముఖ్యమంత్రి అయితే సంతోషించే వారిలో తాను మొదట వరసలో ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.

తన పార్టీలోకి ఎపుడైనా రావచ్చు అంటూ జగన్ తనకు గ్రీన్ కార్డ్ ఇచ్చారని,రాజకీయాల నుంచి తప్పుకున్న తాను ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించానని ఆయన పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో జగన్ దోస్తీ వంటి వాటి వల్ల ఏపీ రాజకీయాల్లో మార్పులేవీ ఉండవని,జగన్ – కేసీఆర్ దోస్తీ వల్ల జగన్ కి నష్టమూ ఉండదు, లాభమూ ఉండదని ఉండవల్లి తేల్చేశారు.