బరిలోకి ఒంటరిగా కాంగ్రెస్

2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ నేతలు బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగా పోటీచేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. 

బాబుకి షాక్ ఇస్తున్న మాణిక్యాలరావు వ్యాఖ్యలు

ఆదివారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌తో సమావేశమైన ఆజాద్‌ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు.

80 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వెల్లడించారు.ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటన అనంతరం ఒంటరి పోరుకు సిద్దమైన కాంగ్రెస్‌ పార్టీ.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో అఖిలేష్‌, మాయావతిలు శనివారం కూటమిపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

బీజేపీని ఓడించేందుకు అవసరమైతే తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని పోతామని ఆజాద్‌ పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో 15 ప్రచార ర్యాలీలను కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌​ గాంధీతో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Advertisement