రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన ఉపాసన!

Upasana Clarity on Politicsమెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు.రామ్‌ చరణ్‌ అప్‌ డేట్స్‌ నే కాకుండా తన వృత్తికి, అపోలో హాస్పిటల్స్‌ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తుంటారు.ఇటీవలె ఆమె దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.

సైరా కోసం నయన్ ని రిక్వెస్ట్ చేసిన చెర్రీ

అయితే తాజాగా ఓ పత్రికలో వచ్చిన వార్తను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు.చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిపై తాను టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్నట్లుగా వచ్చిన వార్తను ఉపాసన ఖండించారు.

అందులో ఎంత మాత్రం నిజం లేదని, తాను ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ ను ప్రేమిస్తున్నానని, కొండ విశ్వేశ్వర రెడ్డి భార్య సంగీతా రెడ్డి తన బాస్‌ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

చిన్నాన్న విశ్వేశ్వర రెడ్డి చేవెళ్లలో మంచి పనులు చేస్తున్నారంటూ ,తనకు రాజకీయాలలో పోటీ చేయాలనే ఉద్ధేశ్యం లేదని ఆమె చెప్పుకొచ్చారు .