సంచలనంగా మారుతున్న వంటేరు వ్యాఖ్యలు

గజ్వెల్ నియోజక వర్గంలో రోజురోజుకి రాజాకీయాలు వేడెక్కుతున్నాయి.ఎందుకంటే కేసీఆర్ ఈ నియోజక వర్గం నుండి పోటీ చెయ్యడమే.కేసీఆర్ ను అధిక మెజారిటీతో గెలిపించడానికి,ఆ బరువు బాధ్యతలన్నీ హరీష్ రావు తన బుజాలపై వేసుకున్నాడు.ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ వర్సెస్ వంటేరులా లేదు,కేసీఆర్ వర్సెస్ హరీష్ లా ఉంది.

కేసీఆర్ ఢిల్లీ టూర్ అందుకేనా?

Vanteru Challenges to Harish Rao

ఈ నియోజక వర్గం నుండి కేసీఆర్ కి పోటీగా కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప రెడ్డి బరిలోకి దిగుతున్నాడు.దీంతో వంటేరుకి హరీష్ మధ్య మాటల వివాదాలు కోటలు దాటుతున్నాయి.

ఇటీవల వంటేరు చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనానికే దారి తీసింది.వాటికి ఇంకా వ్యాజ్యం పోస్తూ,హరీష్ తనను హైదరాబాద్ లో ప్రైవేట్ గా రెండు సార్లు కలిసాడని,కేసీఆర్ ని ఓడించటానికి పథకాలు పన్నాడని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని,వాటిని బయటపెట్టడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నానని,మీడియా ఇంటర్వ్యూ లో సవాళ్లు చేస్తున్నారు.ఇక ఈ సవాళ్లకు హరీష్ ఎలాంటి సమధానం ఇవ్వబోతున్నారో చూడాలి మరి.