త్రివిక్రమ్ కి ఓకే చెప్పిన ‘వెంకీ మామ’

Venkatesh next movie with Trivikramవిక్టరీ వెంకటేష్ ,నాగ చైతన్య కాంబోలో ‘వెంకీ మామ’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఎఫ్2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ తన తరువాతి చిత్రం యొక్క వివరాలు పై క్లారిటీ ఇచ్చారు.

బన్నీతో జతకట్టనున్న కియారా ..

త్రివిక్రమ్ తో తన తరువాతి చిత్రం ఉండబోతుందని తాను ప్రకటించిన వివరాల ద్వారా అర్ధమవుతుంది.
అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్,మల్లీశ్వరి చిత్రాలలో కామెడీ ఎంతగా వర్కౌట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వెంకటేష్ కామెడీ టైమింగ్, మ్యానరిజమ్ కి త్రివిక్రమ్ మార్క్ డైలాగులకు బాగా సెట్ అవ్వడంతో ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వెంకీ త్రివిక్రమ్ కాంబోలో సినిమాకు సన్నాహాలుజరుగుతున్నాయి.

అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో సినిమాకు కమిట్ అయ్యాడు,అలాగే చిరంజీవితో సినిమా ఉండబోతోందంటూ ప్రకటించారు.

అయితే బన్నీ సినిమా, తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా వెంకటేష్ నటించిన ఎఫ్ 2 మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement