`వెంకీ మామ` చిత్ర ట్రైలర్‌

 

వెంకీ మామ చిత్ర ట్రైలర్‌

విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్‌ మూవీ వెంకీ మామ. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా యాక్షన్‌ అండ్‌ ఎమోషన్‌ కంటెంట్‌తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బాబీ (కేయస్‌ రవీంద్ర).
ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నా నటిస్తోంది. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్‌ 13న భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా చిత్ర యూనిట్‌ ఖమ్మంలో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహించారు. ఇదే ఈవెంట్‌లో ‘వెంకీ మామ’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం’అని విక్టరీ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్‌తో  ట్రైలర్‌ ప్రారంభమవుతుంది.