జై జవాన్ జై కిసాన్ గా వస్తున్నా “వెంకీ మామ” ….దీపావళి న్యూ లుక్

Image result for venky mama diwali wishes

దీపావళి ని పురస్కరించుకొని వెంకీ, చైతూలకు సంబంధించిన న్యూ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సొంత మామ అల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య మొట్ట మొదటిసారిగా కలసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’ . కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నాలు నటిస్తున్నారు. . తాజాగా రిలీజ్‌ చేసిన లుక్‌లో వెంకీ సాధారణ దుస్తుల్లో రైతు గా , నాగచైతన్య ఆర్మీ అధికారిగా జై జవాన్ జై కిసాన్ గా కనిపిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక‌్షన్స్‌లో నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.