లీకైన ‘వెంకీమామ’ ఇంట్రడక్షన్ సీన్ వీడియో

బాబీ డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ఇటీవల ఈ చిత్ర మొదటి షెడ్యూల్ రాజమండ్రి లో ప్రారంభమైంది.గోదావరి నది తీరాన వెంకీ , చైతూ లపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించారు.

యాక్షన్ డైరెక్టర్ తో రవితేజ

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఇంట్రడక్షన్ సీన్ కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 26 సెకండ్ల నిడివి గల ఈ వీడియో లో వెంకటేష్ , నాగ చైతన్య లు ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించారు.

ఈ వీడియో బయటకు రావడం తో చిత్ర యూనిట్ అప్రమత్తం అయ్యింది.పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ , చైతు కు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు.

కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Advertisement