తమిళనాడులోని రేసింగ్‌ ట్రాక్ మీద విజయ్!

Vijay Acts in Sports Dramaఅతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో పాటుగా క్రాంతి మాధవన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.

దేవరకొండతో జోడి కట్టనున్న క్యాథరిన్

ఈ రెండు సినిమాలు సెట్స్ పైన ఉండాగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై చెప్పిన కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఈ సినిమాను తెలుగు, తమిళ్‌ తో పాటు కన్నడలోనూ ఒకేసారి తెరకెక్కిస్తారట.

ఇక కథ విషయానికి వస్తే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుందట.ఈ సినిమాలో విజయ్ బైక్‌ రేసర్‌ గా కనిపించబోతున్నాడట. దీంతో ఈ సినిమా కోసం కావాల్సిన ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడట.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ లోనే ఢిల్లీలో బైక్‌ రేసింగ్‌ దృశ్యాలను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.అందుకోసం విజయ్ తమిళనాడు లోని రేసింగ్‌ ట్రాక్స్‌ మీద తెగ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

Advertisement