విజయ్ ని తెలివిగా వాడుకుంటున్నారట!

Vijay Devarakonda Alertsఅతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ,ప్రస్తుతం ఆయన పేరు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దక్షిణాది రాష్ట్రాలలో కూడా వినిపిస్తుంది.కొంతమంది విజయ్ క్రేజ్ ను తమ వ్యాపారాలకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారట.

దేవరకొండతో జోడి కట్టనున్న క్యాథరిన్

హైదరాబాద్ కు చెందిన ఒక గార్మెంట్ కంపెనీ తయారు చేసిన టిషర్ట్స్ ,లుంగీలను ‘రౌడీస్’ పేరుతో ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ వ్యాపారంలో విజయ్ కు కూడ భాగస్వామ్యం ఉంది.

ఇటీవలే బెంగుళూరుకు చెందిన ఒక వ్యాపార వేత్త ‘రౌడీ వేర్’ ప్రయివేట్ లిమిటెడ్ అన్న పేరుతో, ఒక గార్మెంట్ సంస్థను నెలకొల్పి ,ఆ సంస్థ ద్వారా టిషర్ట్స్ రకరకాల మోడల్స్ లో తయారు చేస్తున్నాడట.

ఈ టిషర్ట్స్ మోడల్స్ ను అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో పెట్టడంతో విపరీతమైన స్పందన వచ్చిందట.ఈ మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన విజయ్ బెంగుళూరు కోర్టును ఆశ్రయించారట.అంతేకాదు ఈ విషయంలో ఆ రెడీమేడ్ గార్మెంట్స్ సంస్థకు, అమెజాన్ సంస్థకు కూడ నోటీసులు పంపించారట.

Advertisement