మెగా టైటిల్ ని వాడుకుంటున్న విజయ్ దేవరకొండ

తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా ఓ బహు భాషా చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

‘అర్జున్ సురవరం’ గా రానున్న నిఖిల్

భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

అయితే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి ఒక్కపట్టి సినిమా అయిన ‘హీరో ‘ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఇప్పటివరకు కేవలం మెగా హీరోలు మాత్రమే మెగాస్టార్ ను వాడుకుంటూ వస్తున్నారు.

ఇక ఇటీవల నాని తన కొత్త చిత్రానికి గ్యాంగ్ లీడర్ టైటిల్ ను పెట్టుకోగా, తాజాగా వరుస హిట్ల తో ఫుల్ క్రేజ్ లో ఉన్న విజయ్ దేవరకొండ సైతం తన కొత్త చిత్రానికి చిరంజీవి టైటిల్ ను వాడుకుంటున్నాడు.