దేవరకొండకు అరుదైన గౌరవం

2011లో ‘నువ్విలా’ సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన విజయ్ దేవరకొండ…2012 లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ లో అతిధి పాత్రలో నటించి ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

బన్నీ మహేష్ ల తర్వాత నానిదే  !

‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోగా చేసి ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చాడు ఈ యువ హీరో.ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం , టాక్సీవాలా వరుస హిట్ల తో స్టార్ స్టేటస్ సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ లో టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.

తాజాగా ఈ యువ హీరో విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం దక్కింది. 2019 ఫోర్బ్స్ ఇండియా 30 జాబితాలో చోటు దక్కించుకున్నారు.మూవీస్ క్యాటగిరీలో ఈ జాబితాకు విజయ్ ఎంపిక అయ్యాడు.

భారత్ లో 30 ఏళ్ల కన్నా తక్కువ వయసుకు చెంది, తమ తమ రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబర్చిన వారి జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.

ఈ వార్త తెలుసుకున్న అభిమానులు , సినీ ప్రముఖులు విజయ్ కి విషెష్ అందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. 

Advertisement