తండ్రి పాత్రలో ‘అర్జున్‌ రెడ్డి’

అర్జున్‌ రెడ్డి , గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో సెన్సేషనల్‌ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేం కాంత్రి మాధవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

దేవరకొండ సినిమాలో ఛాన్స్ కోసం అనసూయ ?

Vijay in Father Roleప్రతీ చిత్రలోనూ ఏదో ఒక వేరియేషన్‌ చూపిస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో ఈ చిత్రంతో మరో సాహసానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రంలో 8 సంవత్సరాల అబ్బాయికి తండ్రి గా కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలతో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ
ని ఇప్పటివరకు అలాంటి రోల్ లో ఎవరు ఊహించుకోలేదు. విజయ్ సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్ గా కూడా కనిపించబోతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కాథరిన్ , ఇజబెల్లి కథానాయిలుగా నటిస్తుండగా గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంతో సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement