మెగా మేనల్లుడికి విలన్ గా విజయ్ సేతుపతి

నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే.

దేవరకొండకు అరుదైన గౌరవం

వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇందులో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట.అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఈ తరహా పాత్రను విజయ్ సేతుపతి అయితేనే సరిగ్గా చేయగలడని ఆయన్ని సంప్రదించగా…
వెంటనే ఓకే చేసినట్లుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు. 

Advertisement