విజయ్ టాక్సీవాలా యావరేజ్ అటగా ?

అప్పుడెప్పుడో డ్రీం బి హైన్డ్ టాక్సీవాలా అంటూ విజయ్ పిల్లలతో కలిసి, తాను అర్జున్ రెడ్డి ముసుగులోంచి వచ్చేసి కొత్త సినిమా చేస్తున్నానంటూ చెప్పాడు.తర్వాత టాక్సీవాలా వెనక పడిపోవడం, గీత గోవిందం -నోటా లాంటి సినిమాలు రావడం,ఆల్రెడీ టాక్సీవాలా పైరసీ చూసిన వాళ్ళు పర్లేదు అనడం అన్నీచక చకా జరిగిపోయాయి.

కట్ చేస్తే ఈ నెల 17 న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందని మూవీ యూనిట్ చెప్పేసింది. పాటలతో సందడి చేస్తోంది కూడా. ఇక ఇప్పుడు “రియాలిటీ బి హైన్డ్ టాక్సీవాలా ” అంటూ మళ్ళీ అదే పిల్లలతో ఇంకో వీడియో చూసి సినిమా మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేశాడు విజయ్.

ఈ వీడియో లో ఉడకని పాస్తా ను , పైరసీ లో వచ్చిన టాక్సీవాలా ను కలిపి చూపి అవి అలా బాలేవని ., ఉడికిన తర్వాత పాస్తా ఎలా ఉంటుందో .,17 న థియేటర్ లో టాక్సీవాలా అలా ఉంటుందంటూ చెప్పారు. ఇదిగో ఈ వీడియో లో మీరూ చూడండి ఆ కథా కమామీషు.

 

Advertisement