ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత!

Vijaya Bapineedu Passed awayప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు ఈ రోజు ఉదయం మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

‘మిస్ గ్రానీ’తో అలరించనున్న సమంత

బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు రూపొందించారు.చిరంజీవి హీరోగా వచ్చిన ‘మగ మహారాజు’తో దర్శకుడిగా మారి,అనంతరం మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఇండస్ట్రీకి అందించారు.

రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా పరిచయం చేశారు. అలాగే పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే.

మంచి చిత్రాలకు, కుటుంబ కధా చిత్రాలకు విజయ బాపినీడు పెట్టింది పేరు. ఆయనలోని మరో కోణం. పత్రికా బాధ్యతల నిర్వహణ.అప్పట్లో అయిదు రూపాయలకు ‘విజయ’ నెల పత్రికలో సినిమా బుక్, కామెడీ బుక్, నవల వంటివి కలిపి ఒక ప్యాక్ గా అందికరికీ అందిచిన ఘనత ఆయనే దక్కింది.

Advertisement