మహేష్ మూవీ లో కనిపించనున్న లేడీ డాన్

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమా జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఫిదా బ్యూటీ రొమాన్స్

ఇక ప్రస్తుత సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ డాన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన విజయ శాంతి ని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని చూస్తున్నారట.

అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కాగా కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తోన్న డైరెక్టర్.

తాజా మహేష్ సినిమాలో విజయ శాంతిని నటింపజేయాలని అనిల్ చూస్తున్నాడట.మరి ఈ చిత్రానికి విజయ శాంతి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

 

 

Advertisement