‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి విజయం సాంగ్ విన్నారంటే..

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి ఒక అడుగు ముందుకు వేసి ,‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో రాజకీయాలలో ప్రకంపణలు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు.

చంద్రబాబుని వదలని వర్మ!

ఈ సినిమా విడుదల కాకుండా టీడీపీ శ్రేణులు కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే.కానీ కోర్టు టీడీపీకి షాక్ ఇస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఇప్పటికే వర్మ ఈ సినిమాకు సంబంధించిన వీడియో లిరకల్ సాంగ్స్ , పోస్టర్లు, ట్రైలర్లు విడుదల చేస్తూ,ఈ సినిమాపై ఎక్కడ లేని హైప్ తీసుకు వచ్చాడు.

తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి మరో పాట ప్రోమో విడుదలైంది. ‘విజయం విజయం ఘన విజయం’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వర్మ విడుదల చేశారు.

పాట పూర్తయిన తర్వాత ‘నీలాంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని నిందలు మోపారు. వాళ్లందరికీ ఈ ఘన విజయం ఓ గొప్ప చెంపదెబ్బ అన్న ఎన్టీఆర్ డైలాగ్ కూడా వినిపిస్తోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను చూడండి.