మాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న ‘VVR’

VVR in Mollywoodబోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా పై అందరు మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సైరా కోసం నయన్ ని రిక్వెస్ట్ చేసిన చెర్రీ

ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లో రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.విడుదల అయిన అన్ని సెంటర్లలో డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించింది.

గత కొన్నేళ్లుగా తెలుగులో సరిగ్గా ఆడని సినిమాలు, వేరే భాషల్లో డబ్బింగ్ రూపంలో కానీ యూట్యూబ్ పరంగా రికార్డు సృష్టిస్తున్నాయి.నిజానికి అల్లు అర్జున్,రామ్ చరణ్ కు మాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

దీంతో మాలీవుడ్ లో ఈ సినిమాను డబ్ చేశారు. కాగా అక్కడ ఈ సినిమా ఊహించని వసూళ్లను సాధిస్తూ,మంచి టాక్ ను కూడా తెచ్చుకుందట.చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతుందో!.

Advertisement