తెలుగు రాష్ట్రాల్లో ‘VVR’కు భారీ ఆఫర్!

VVR Extra Shows in Telugu Statesరామ్ చరణ్,బోయపాటి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’.ఈ సినిమా రేపు భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది.కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే అభిమానుల సందడి మొదలైంది.

భారీగా ‘VVR’ ప్రీ రిలీజ్ బిజినెస్!

అయితే ఈ చిత్రానికి సంబంధించి అదనపు షోలపై అనుమతి రావాల్సి ఉంది.తాజాగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి అదనపు షోలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

దీంతో నిర్మాతలు థియేటర్లను పెంచడం జరిగింది.ఇప్పటికే థియేటర్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు,యూవీవీ సంస్థ ముందుగానే కళ్ళు తెరిశారు.చూడాలి మరి ఈ విధేయుడి విజృంభణ రేపు ఎలా ఉండబోతుందో.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా,ప్రతినాయకుడి పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు.కాగా స్నేహ ,ప్రశాంత్ ,ఆర్యన్ రాజేష్ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు.

Advertisement