‘యాత్ర’ మొదటి టిక్కెట్ రేటు..

'Yatra' Movie First Ticket Costఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు.కాగా ముఖ్యమైన పాత్రలలో జగపతి బాబు,ఆశ్రిత వేముగంటి,సుహాసిని కనిపించనున్నారు.

నేనెందుకు మధ్యలోకి రావాలి:జగన్

కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 8న విడుదల కానుంది.తాజాగా అమెరికాలోని సీటెల్‌ లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ ను ఈ సినిమా నిర్మాతలు వేలం వేశారు. మొదటి టిక్కెట్టును మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లు అంటే దాదాపుగా 4.37లక్షలు పెట్టి గెలుచుకున్నారు.

దీంతో ఈ చిత్ర నిర్మాతలు $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి, మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌ కు విరాళంగా ఇస్తామని తెలిపారు.అలాగే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement