యాత్ర ట్రైలర్:వస్తున్నాడు ప్రజా సైనికుడు

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’.ఈ సినిమాను మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నారు.ఫిబ్రవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏడాది పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర!

వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రస్తావనగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టీ నటిస్తుండగా,అశ్రిత వేముగంటి వైయస్ విజయమ్మ పాత్రలో,జగపతి బాబు రాజారెడ్డి పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ చిత్రబృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ ట్రైలర్ లో మమ్ముట్టిని చూస్తుంటే వైయస్ రాజశేఖర్ రెడ్డిని తలపిస్తున్నారు.ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోవాలంటే ప్రజల వద్దకే వెళ్ళాలి అంటూ,ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర ఘట్టం మరోసారి రాజన్న పాలనను గుర్తు చేసింది.ఈ సినిమా వైయస్ అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ‘యాత్ర’ ట్రైలర్ చూడండి.

Advertisement