అదే దారిలో ‘యాత్ర’..

Yatra Movie Update

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా, ఆయన చేసిన పాదయాత్ర నేపథ్యంతో మహి వి రాఘవ్ ‘యాత్ర’ సినిమా తెరకెక్కించారు.ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మళయాళ స్టార్ మమ్ముట్టి నటించడం జరిగింది.

షర్మిల కేసులో టీడీపీ డొంక కదులుతుందా?

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉందని చెప్పొచ్చు.మహానటి సినిమా బయోపిక్ సినిమాలకు ఓ ఉత్సాహాన్ని తీసుకురాగా, ఆ తర్వాత వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.

అయితే మహానటి సినిమా దారిలోనే యాత్ర వస్తుందని అంటున్నారు. రెండిటికి పోలిక ఎక్కడ ఉంది అంటే సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా ఈ బయోపిక్ రావడమే.

ఏదో సావిత్రి బయోపిక్ అంటా నాగ్ అశ్విన్ అని, ఒక సినిమా అనుభవం ఉన్న కుర్రాడు తీస్తున్నాడని, ఆ సినిమాపై ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా వెళ్లి సినిమా చూసి షాక్ అయ్యారు. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది.

ఇప్పుడు అదే దారిలో యాత్ర సినిమా వస్తుంది. మహి వి రాఘవ్ ఆల్రెడీ ఆనందో బ్రహ్మ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత వైఎస్ బయోపిక్ గా యాత్ర సినిమా చేశాడు.మరి ఈ యాత్ర ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

Advertisement