‘యాత్ర’ ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ !

దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం పై టాలీవుడ్ లో మంచి అంచనాలు వున్నాయి.

శాస్త్రవేత్తగా ప్రముఖ నటుడు

Yatra pre release event date

ఇప్పుడు ఈ చిత్రం కోసం అటు సినీ ప్రేమికులు మరియు రాజకీయనాయకులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది.కాగా, ఈ చిత్రానికి సంబందించిన ఒక తాజా వార్త వెలువడింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పాడడం తో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ ని జరపాలని ప్లాన్ చేస్తున్నారు .

ప్రీరిలీజ్ వేడుకను ఫిబ్రవరి 1న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేస్తారు అనే విషయంపై ఇంకా స్పష్టతలేదు.

ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో నటిస్తుండగా, వైఎస్ విజయమ్మ పాత్రలో అశ్రిత వేముగంటి నటించారు.అనసూయ, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement