వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అప్పుడేనట!

YCP Campaign Candidates Listఏపీలో ఎన్నికల నామినేషన్ దగ్గర పడుతుండటంతో,వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో,  ఈ నెల 16న 10:20 నిమిషాలకు ఇడుపులపాయలో తొలి విడత అభ్యర్థుల జాబితాను  వైయస్ జగన్ ప్రకటించనున్నారు. మొత్తం 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడత జాబితా వెల్లడించనున్నారు.

టీడీపీకి షాక్ వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

తెలుస్తున్న సమాచాచారం ప్రకారం మొదటి జాబితాలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నారు.అలాగే తొలి జాబితా ప్రకటించిన తరువాత, దివంగత వైయస్సార్ ఆశీస్సులతో ఇడుపులపాయ నుండే ఎన్నికల ప్రచారం  వైయస్ జగన్ మొదలుపెట్టనున్నారు.

వాస్తవానికి వైసీపీ అభ్యర్థుల జాబితా ఈరోజే ప్రకటించాల్సింది.కాకపోతే ఒకవైపు పార్టీలోని ముఖ్యులతో చర్చలు మరోవైపు పార్టీలో చేరికలతో జగన్ కు సమయం సరిపోలేదు.

అంతేకాకుండా  టిడిపిలో నుండి మరింకొందరు ముఖ్యనేతలు వైసిపిలోకి రావచ్చన్న సంకేతాలు అందటంతో జాబితా ప్రకటనను వాయిదా వేసినట్లు సమాచారం.

ఒకసారి జాబితాను ప్రకటించేసిన తర్వాత అదే స్ధానంలో ఇంకెవరైనా ముఖ్యులు వచ్చి చేరితే అభ్యర్ధిని మార్చటం సాధ్యం కాదని జగన్ భావించారట. అందుకనే మొదటి జాబితా వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.