వైఎస్‌ జగన్‌ సంచలనం : నా యుద్ధం రాక్షసులు,మోసగాళ్ళతో

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విరుచుకు పడ్డాడు.

పరిటాల సునీతకి షాక్ :వైసీపీ లోకి కీలక అనుచరుడు

నేడు అనంతపురంలో నిర్వహించిన వైసీపీ శంఖారావం సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పడుతూన్న కష్టాలని ప్రస్తావించారు.

నేను ప్రజలకోసం తీవ్రమైన యుద్ధం చేస్తున్నానని, ప్రజారంజక పాలన అందించాలంటే రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు.చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

అధికారంలో ఉన్న వాళ్లు ఎన్నో కష్టాలు పెట్టారు.తొమ్మిదేళ్లుగా నాతో పాటుగా మీరు కూడా ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసు. కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారు.

మరికొందరిని పథకాలను దూరం చేశారు.మన అన్న ముఖ్యమంత్రి అవుతాడని 2 వేల నుంచి 3 వేలకు పెంచుతాడని,వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకి తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడని, నవరత్నాల్లోని ప్రతీ అంశం అమలు చేస్తాడని అందరికీ చెప్పండి.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 60 లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని, దయచేసి అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధినేత ప్రజలకు సూచించారు.

Advertisement